ప్రస్తుతం రాజకీయాలు వద్దు: పవన్‌ కల్యాణ్‌
close
Published : 10/04/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రస్తుతం రాజకీయాలు వద్దు: పవన్‌ కల్యాణ్‌

విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాజకీయాల జోలికి వెళ్లడం లేదని.. సంయమనంతో వ్యవహరిద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో పవన్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని వైకాపా నేతలతో పంపిణీ చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సభ్యులకు పవన్‌ సూచించారు. కరోనా నియంత్రణలో ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన సూచనలు పాటిస్తూ పేద ప్రజలకు అండగా నిలుద్దామని పవన్‌ పిలుపునిచ్చారు.

‘‘కరోనా మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ విధించడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి అయింది. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు పార్టీ పరంగా అన్ని విధాలా సహకరిద్దాం. వారికి ఏ విధంగా సాయం చేయాలనేదానిపై ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్దాం. ఇలాంటి సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సేవలు అందేలా చూడాలి’’ అని పవన్‌ సభ్యులను కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని