సీఏఏ రద్దుపై తీర్మానం..రాజస్థాన్‌ ఆమోదం
close
Updated : 25/01/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఏఏ రద్దుపై తీర్మానం..రాజస్థాన్‌ ఆమోదం

జైపూర్‌: పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో సీఏఏను రద్దు చేయాలంటూ తీసుకొచ్చిన తీర్మానానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ పలువురు భాజపా నేతలు వెల్‌లోకి వెళ్లి సీఏఏకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  సీఏఏను రద్దు చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపిన మూడో రాష్ట్రం రాజస్థాన్‌.

గత నెలలో కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. శాసనసభలో ఈ తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రవేశపెట్టగా ఒక్క భాజపా ఏకైక ఎమ్మెల్యే మినహా మిగతా సభ్యులంతా ఆమోద ముద్ర వేశారు. అనంతరం పంజాబ్‌ కూడా ఇదే విధంగా తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. ఈనెల 27న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల ఆ రాష్ట్ర మంత్రి ప్రకటించారు. సీఏఏను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సమయంలోను సీఏఏను వెనక్కి తీసుకోవాలని ఆమె సూచించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని