కరోనా భయం..నౌకలో బందీలుగా 3700 మంది
close
Updated : 04/02/2020 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా భయం..నౌకలో బందీలుగా 3700 మంది

టోక్యో: కరోనా వైరస్‌ నౌకలో ప్రయాణిస్తున్న వారిని కూడా వదలలేదు. 3711 మంది ప్రయాణిస్తున్న జపాన్‌కు చెందిన ఓ క్రూయిజ్‌ షిప్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వీరిలో 2,666 మంది ప్రయాణికులు కాగా 1,045 మంది సిబ్బంది. యొకొహామా తీరానికి చేరిన ఈ నౌకను జపాన్‌ ప్రభుత్వం అక్కడే నిలిపి ఉంచింది. దీంతో ప్రయాణికులంతా 24గంటలుగా అందులోనే ఉండిపోయారు. వారందరికీ.. వైద్య పరీక్షలు చేసే వరకు వారిని బయటకు వదిలేది లేదని అధికారులు తెలిపారు. 

ఇప్పటికే నౌకలోకి వెళ్లిన వైద్యులు పరీక్షలు ప్రారంభించారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన 80 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఇటీవల ఇదే నౌకను ఒకినావా పోర్టు తీరంలోనూ ఆపడం గమనార్హం. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జపాన్‌ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించింది. వుహాన్‌లో ఉన్న 500 మంది జపనీయులను సొంత దేశానికి తీసుకెళ్లింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని