హఫీజ్‌ సయీద్‌కు 11ఏళ్ల జైలు
close
Published : 12/02/2020 19:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హఫీజ్‌ సయీద్‌కు 11ఏళ్ల జైలు

ఇస్లామాబాద్‌: 26/11 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ కోర్టు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించారన్న రెండు కేసుల్లో అతడిని దోషిగా తేల్చింది. ఒక్కో కేసుకు ఐదున్నరేళ్ల చొప్పున మొత్తం 11 ఏళ్లు జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు ఒక్కో కేసులో రూ.15వేలు చొప్పున జరిమానా విధించింది. ఉగ్రవాదులకు నిధుల సహకారం ఆపాలంటూ అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో హఫీజ్‌ సయీద్‌పై ఆ దేశం ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, మనీలాండరింగ్‌ సహా మొత్తం 23 కేసుల్లో హఫీజ్‌ సయీద్‌ను నిందితుడిగా పేర్కొంటూ అతడిపై పాకిస్థాన్‌లోని పంజాబ్‌ కౌంటర్‌ టెర్రరిజమ్‌ డిపార్ట్‌మెంట్‌ అభియోగాలు దాఖలు చేసింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని