నౌకలో 40 మంది అమెరికావాసులకు కొవిడ్‌-19
close
Updated : 17/02/2020 10:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నౌకలో 40 మంది అమెరికావాసులకు కొవిడ్‌-19

 

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మృతుల సంఖ్య 1770కు చేరింది. తాజాగా ఆదివారం మరో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 100 మంది వైరస్ తాకిడి ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్సుకు చెందినవారే కావడం గమనార్హం. కొత్తగా మరో 2,048 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఇప్పటి వరకు 10,844 మందిని వైరస్‌ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. ఇక హాంకాంగ్‌లో వైరస్‌ సోకిన వారి సంఖ్య 57కు చేరింది. ఇప్పటికే అక్కడ ఒకరు మరణించారు. మకావులో 10 మందికి, తైవాన్‌లో 20 మందికి ఇది సోకినట్లు గుర్తించారు. తైవాన్‌లో ఆదివారం తొలి కరోన మరణం సంభవించింది. కొత్తగా వైరస్‌ సోకుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని స్థానిక అధికారులు తెలిపారు. దీంతో వైరస్ కట్టడికి తాము తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి చైనాకు చేరుకున్న 12 మంది సభ్యుల బృందం స్థానిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తోంది. హుబెయ్‌లో ఆంక్షల్ని మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు జపాన్‌ నౌకలో 40 మందికి పైగా అమెరికా పౌరులకు వైరస్‌ సోకినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందినవారు నౌకలో మొత్తం 400 మంది ఉన్నారు. వీరిని యూఎస్‌కు తిరిగి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానాన్ని పంపారు. అయితే వైరస్ సోకిన వారిని మాత్రం ప్రస్తుతానికి అక్కడే ఉంచుతామని అధికారులు తెలిపారు.   

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని