చైనాలో వరద నష్టం రూ.74 వేల కోట్లు
close
Published : 24/07/2021 04:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనాలో వరద నష్టం రూ.74 వేల కోట్లు

56కి చేరిన మృతుల సంఖ్య

బీజింగ్‌: చైనాలో వరదల బీభత్సానికి మరణించిన వారి సంఖ్య 56కి చేరింది. మరో అయిదుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. దాదాపు రూ.74 వేలకు కోట్లకుపైగా ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు చైనీస్‌ మీడియా వెల్లడించింది. ఐఫోన్‌ సహా వివిధ పరిశ్రమలకు నిలయమైన హెనన్‌ ప్రావిన్స్‌లో గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిన విషయం తెలిసిందే. వరదల ప్రభావం హెనన్‌ ప్రావిన్స్‌లోని 30 లక్షల మందిపై పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. సుమారు 3 లక్షల 76 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ఐఫోన్‌ సిటీగా పిలిచే హెనన్‌ ప్రావిన్స్‌ రాజధాని ఝెన్‌ఝౌలో విద్యుత్తు, మంచినీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఆసుపత్రులు సైతం అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వరద ప్రాంతాల్లోని ఆసుపత్రుల నుంచి రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ప్రస్తుతం ఝెన్‌ఝౌలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అధికారులు సహాయక కార్యక్రమాలను వేగవంతం చేశారు. దాదాపు 8 వేల మంది సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని