అందానికి హంగులద్దుదామా!
close
Published : 22/08/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందానికి హంగులద్దుదామా!

రోజూ అవసరం లేదు... వారంలో ఒక్క రోజు చర్మ, కేశ సంరక్షణకి కాస్త సమయాన్ని కేటాయించండి చాలు. వారమంతా వెలిగిపోవచ్చు!

రోజూ హడావుడిగా స్నానంచేసి నిమిషాల్లో పరుగులుపెట్టే మీరు వారంలో ఒకరోజు పాలు, పెసరపిండి, సెనగపిండి, వట్టివేళ్లపొడి, కాస్త పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, చందనం, గులాబీరేకల ముద్ద కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి కాస్త నువ్వుల నూనె జతచేసి ఒంటికి నలుగు పెట్టుకుంటే సరి. ఇది ఒంటికి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. మేని మెరిసిపోతుంది.

* కేవలం చర్మం అందంగా ఉంటేనే సరిపోదు కదా! జుట్టుకీ ఆ మెరుపు కనిపించాలి. మెంతికూరలో కాస్త పెరుగుని కలిపి మిక్సీ పట్టండి. దానికి కాస్త కొబ్బరిపాలూ జతచేయండి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి కుదుళ్లకూ పట్టించండి. పావుగంటయ్యాక వేడినీళ్లలో ముంచిన టవల్‌ని తలకి చుట్టి ఆవిరిపట్టండి. గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేస్తే...జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

* మరి కాళ్లూ, చేతులూ కూడా కోమలంగా కనిపించాలి కదా! పంచదారలో కాస్త గులాబీరేకల ముద్దను కలపండి. దీనికి రెండు చుక్కల గులాబీ నూనెనూ చేర్చండి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి రుద్దండి. అప్పుడు మృదువుగా మారతాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని