అరరె.. నిజమే కదా!
close
Updated : 29/08/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరరె.. నిజమే కదా!

సుధాకర్‌ ఓ కారు డ్రైవర్‌. మంచివాడే కానీ చాలా మొండివాడు. కొన్నిసార్లు ఎవరెంతగా చెప్పినా వినడు. తనకు తోచిందేదో తాను చేస్తాడు. చివరకు చిక్కుల్లో పడతాడు. ఓ సారి వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళుతున్నాడు. మధ్యలో ఓ టైరు పంక్చరైంది. సుధాకర్‌ మొండివాడు కదా.. అలాగే కారును హైదరాబాద్‌ వరకు నడుపుతూ వెళ్లి.. చివరకు అక్కడ రిపేరు చేయించాడు. ఇంతకీ పంక్చరైన టైరుతో అంతదూరం.. అదీ సరైన సమయానికే ఎలా వెళ్లగలిగాడు?


తమాషా ప్రశ్నలు

1. గుడిలో ఉండని స్వామి?

2. పెద్దలకు నచ్చే బడి ఏంటి?

3. ఓ గ్రహం లేకుంటే మరో గ్రహం వస్తుంది? ఇంతకీ ఏమిటా గ్రహాలు?


చెప్పుకోండి చూద్దాం

మూడు అక్షరాల బాధ, మధ్య అక్షరం తొలగిస్తే భార్య. ఏమిటది?


క్విజ్‌.. క్విజ్‌..

1. ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటే.. ఆ సంవత్సరాన్ని ఏమని పిలుస్తారు?

2. మిలీనియం అంటే ఎన్ని సంవత్సరాలు?

3. అతి చిన్న ఖండం ఏది?

4. ఎన్ని మిల్లీమీటర్లు కలిస్తే ఒక సెంటీమీటరు అవుతుంది?

5. ఏ పక్షిని శాంతికి చిహ్నంగా భావిస్తారు?


పొడుపు కథలు

1. పువ్వు పూస్తుంది. కాయ కాస్తుంది. గువ్వ కూర్చోవడానికి కొమ్మ మాత్రం లేదు?

2. వంగచెట్టు కింద లింగడు. ఎంత కొట్టినా లొంగడు?

3. పగిలితే పనికొస్తా. మిగిలితే చట్నీ అవుతా.. ఇంతకీ ఎవరు నేను?పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం!

carrots, rake, soil, veggies, compost, shade, sun, dig, nurture

snails, rain, sprouts, gardener , fence, worms, shovel

water, rows, slug, plants, seeds, bulbs, seedlings


ఈ సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,

3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


జవాబులు

అరరె.. నిజమే కదా!: పంక్చరైంది స్టెపినీ టైరు కాబట్టి!

తమాషా ప్రశ్నలు: 1.భాగస్వామి 2.రాబడి 3. నిగ్రహం, ఆగ్రహం

క్విజ్‌.. క్విజ్‌..: 1.లీపు సంవత్సరం 2.వెయ్యి సంవత్సరాలు 3.ఆస్ట్రేలియా 4.10 మిల్లీమీటర్లు 5.పావురం

చెప్పుకోండి చూద్దాం: ఆకలి

పొడుపు కథలు: 1. వరిమొక్క 2. నీడ 3. కొబ్బరికాయ

కవలలేవి: 1, 3.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని