వ్యాక్సిన్‌ జాబ్‌.. వ్యంగ్యోక్తుల జైబ్‌
close
Updated : 01/03/2021 05:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాక్సిన్‌ జాబ్‌.. వ్యంగ్యోక్తుల జైబ్‌

ఇంగ్లిష్‌ దినపత్రికల శీర్షికల్లో, వార్తల్లో ఇటీవల తరచూ కనిపిస్తున్న ఓ రెండు వ్యక్తీకరణలను పరిశీలిద్దాం. వాటి అర్థం, వాక్యాల్లో ప్రయోగం తెలుసుకుందాం!

JAB

కొవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చిన సందర్భంలో ఈ పదాన్ని వార్తల్లో ఎక్కువగా వాడుతున్నారు. JAB అనే పదానికి అర్థం- సన్నని/ పదునైన వస్తువుతో వేగంగా, ఒత్తిడితో పొడవటం/ కొట్టటం. టీకా వేయించుకోవటం అనే అర్థంలో దీన్ని వాడుతున్నారు.
Norms set for COVID-19 jab in private hospitals. (ప్రైవేటు వైద్యశాలల్లో కొవిడ్‌-19 టీకా నిబంధనలను రూపొందించారు.)
The doctor jabbed the needle into his hand. (డాక్టరు సిరంజిని అతడి చేతికి గుచ్చారు.)
Did you have a flu jab this year? (ఫ్లూ టీకాను ఈ ఏడాది తీసుకున్నావా?)


JIBE

రాజకీయ నాయకులు వేరే పార్టీల నేతల తీరును హేళన చేస్తూ కటువైన విమర్శలు కురిపించే సందర్భంలో ఈ పదం వార్తల్లో కనిపిస్తుంటుంది. JIBE పదానికి హేళన/ అవమానించే వ్యంగ్య వ్యాఖ్య అని అర్థం.
Rahul takes a jibe at govt. over inflation (ద్రవ్యోల్బణం గురించి ప్రభుత్వంపై రాహుల్‌ వ్యంగ్యోక్తి.)
KTR takes jibe at Union govt., over soaring fuel prices (చమురు ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ వ్యంగ్య వ్యాఖ్య.)
K Palaniswami takes Jibe at Stalin, says ‘CM’s post not a commodity to buy’ (సీఎం పదవి కొనుక్కునే సరుకేమీ కాదు- స్టాలిన్‌పై కె.పళనిస్వామి వ్యంగ్య విమర్శ.)మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని