Karnataka: భర్త మాటలతో విరక్తి బాట
close
Updated : 13/06/2021 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Karnataka: భర్త మాటలతో విరక్తి బాట


బిక్కుబిక్కుమంటున్న నాగరత్న

దావణగెరె, న్యూస్‌టుడే : ఇదేదో సినిమాల్లో కనిపించే సన్నివేశాన్ని గుర్తుకుతెచ్చేదిగా ఉంది. భర్తతో గొడవ కారణంగా ఓ ఇల్లాలు తన ఐదేళ్ల కొడుకును తీసుకుని.. మూటాముల్లెతో ఏకంగా వంద కిలోమీటర్ల దూరాన్ని నడిచింది. ఈలోగా పోలీసులు ఆమెను నిలువరించడంతో అసలు విషయం బయటపడింది. ఆమెకు తగిన విశ్రాంతిని కల్పించి వాహనంలో సోదరి ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. శివమొగ్గ జిల్లా గాడికొప్ప గ్రామానికి చెందిన నాగరత్న అనే మహిళ భర్తతో ఘర్షణపడింది. ఇక సంసారం చేయడం ఇష్టం లేదంటూ ఎవరికీ తెలియకుండా కొడుకును తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరి విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా తుంబిగెరెలోని సోదరి నివాసానికి వెళ్లాలని నిర్ణయించింది. రాత్రి వేళకు ఆమె దావణగెరె చేరుకుంది. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ ఈమె నడిచి వస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు విచారించడంతో అసలు విషయం వెల్లడైంది. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు లేనందున కాలినడకన వెళ్తున్నట్లు చెప్పింది. కాపలా ఉన్న పోలీసులు ఆమెకు విశ్రాంతి కల్పించి ఆహారాన్ని అందించారు. అనంతరం వాహనాన్ని సమకూర్చి సోదరి ఇంటికి వెళ్లడానికి సహకరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని