TS News: తండ్రితో తగాదా.. కుమారుడి ఆత్మహత్య
close
Updated : 31/07/2021 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: తండ్రితో తగాదా.. కుమారుడి ఆత్మహత్య

న్యూస్‌టుడే, మిరుదొడ్డి: సాగు పనుల విషయంలో తండ్రితో తరచూ తగాదాలు జరుగుతుండగా.. మనస్తాపానికి గురైన యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు.. మిరుదొడ్డికి చెందిన మొగుళ్ల బీరయ్య, దుర్గవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఐలయ్య (26) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆరునెలల క్రితం అతనికి వివాహమైంది. వ్యవసాయ పనుల విషయమై ఎప్పుడూ తండ్రితో తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని