పామునే పాము కాటేస్తే?
close
Published : 13/04/2016 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పామునే పాము కాటేస్తే?

పామునే పాము కాటేస్తే?

ప్రశ్న ఒక విషసర్పాన్ని మరో విషపు పాము కాటేస్తే, కాటుకు గురైన పాము చనిపోతుందా?

- అభిజిత్‌, హైదరాబాద్‌

జవాబు: పాములు పగపట్టవు. వాటిలో వాటికి కూడా ఎప్పుడూ వైరం ఉండదు. ఒకే మాంసం ముక్కకోసమో, లేదా రొట్టె ముక్క కోసం కుక్కలు పోట్లాడుకున్నట్టు పాములు పోట్లాడుకోవు. ఒకే కప్ప కోసం రెండు మూడు పాములు ఎగబడడం చాలా అరుదు. ఎందుకంటే పాముల జనాభా చాలా తక్కువగా ఉండడమే!

నేలమీద సంచరించే వందలాది పాము జాతుల్లో కేవలం మూడు రకాల సర్పాలు మాత్రమే విషాన్ని కలిగి ఉన్నాయి. అవి త్రాచుపాము, కాట్ల పాము, రక్త పింజర. అవి ఉన్న నైసర్గిక స్వరూపాన్నిబట్టి వాటి రంగు, రూపాల్లో కొంచెం తేడా ఉంటుంది.

పాము కాటు ఎప్పుడు ప్రమాదమంటే, మొదట పాముకున్న విష దంతాలు సర్పద్రష్ట (పాము కాటుకు బలైనది) చర్మంలోకి బాగా చొరబడాలి. ఆ తర్వాత విషసర్పం తన పైదవడను వత్తడం ద్వారా తగు మోతాదులో విషాన్ని ఆ విషదంతాలు (Fangs)గుండా స్కలించాలి. డాక్టర్లు మనకు ఇంజక్షన్‌ ఇచ్చినట్టన్నమాట. సాధారణంగా ఒకపాము మరో పామును పగపట్టి కాటువేయదు. పొరపాటున పళ్లు గుచ్చుకున్నా విషాన్ని స్కలించదు. ఒకవేళ విషాన్ని తగు మోతాదులో చిమ్మితే కాటుకు గురైన పాము తప్పకుండా చనిపోతుంది. అంతెందుకు విషసర్పం పొరపాటున తనను తానే కాటు వేసుకున్నా అది చనిపోతుంది.

- ప్రొ ॥ ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం,
జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని