కాయల్లోనూ ఆ క్రియ జరుగుతుందా?
close
Published : 06/05/2016 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాయల్లోనూ ఆ క్రియ జరుగుతుందా?

ఎందుకు? ఏమిటి?ఎలా?
కాయల్లోనూ ఆ క్రియ జరుగుతుందా?

ప్రశ్న: ఆకులాగా పచ్చగా ఉండే కాయలు కూడా కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటాయా?

జవాబు: వృక్షాల్లో ఏ భాగం పచ్చగా ఉన్నా ఆ భాగంలో దాదాపు కచ్చితంగా పత్ర హరితం ఉంటుంది. అక్కడ ఏమాత్రం చెమ్మ (నీరు) ఉన్నా అందుబాటులో ఎటూ వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడు కూడా లభ్యం కావడం వల్ల కాంతి సమక్షంలో విధిగా ఆ పచ్చని పత్రహరితం కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటుంది. ప్రధానంగా ఆకుల్లోనే కిరణజన్య సంయోగక్రియ ద్వారా అటు వృక్షాలకు ఇటు జంతువులన్నింటికీ కావలసిన ఆహారం లభ్యమవుతున్నా తాము పండి ఆకుపచ్చ నుంచి రంగు మారే వరకూ ఉడుతా భక్తిగా కాయలూ కాస్తోకూస్తో తమవంతుగా కిరణజన్య సంయోగక్రియలో పాల్గొంటాయి.

- ప్రొ॥ ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,
శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని