రక్షిత అడవులుగా రాజముద్ర
close
Updated : 30/07/2021 06:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రక్షిత అడవులుగా రాజముద్ర

మూడు ప్రాంతాల్లో అభ్యంతరాల పరిష్కారం
37,135 హెక్టార్లుకు త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్‌
మరో 50,701 హెక్టార్ల అభ్యంతరాలపై దృష్టి
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే

టవీ భూములకు సంబంధించి చిరకాలంగా చిక్కుముడిగా మారిన అభ్యంతరాలకు అధికారులు పరిష్కారం చూపారు. సమస్యలన్నీ పరిష్కారమైన ప్రాంతాలను కొద్దిరోజుల్లో రక్షిత అడవులుగా రాజపత్రంలో (గెజిట్‌ నోటిఫికేషన్‌) ముద్రించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే అటవీ చట్టాలన్నీ ఇక్కడ పకడ్బందీగా అమలవుతాయి.

నర్సీపట్నం అటవీ డివిజన్‌లో 2,34,367 హెక్టార్లలో అడవులు ఉన్నాయి. ఈ విస్తీర్ణంలో 64 బ్లాక్‌ల్లో ఇప్పటివరకు 52 బ్లాక్‌ల్లో అభ్యంతరాలు పరిష్కారం కాగా తాజాగా లోతుగెడ్డ రేంజ్‌లోని అక్కుజంగి, ఆర్వీనగర్‌ రేంజ్‌లోని పెదవలస, మర్రిపాకల రేంజ్‌లోని పుట్టకోట ప్రాంతాల్లో 37,134 హెక్టార్లలో అభ్యంతరాలన్నీ పరిష్కారమైనట్టు విశాఖపట్నం సెటిల్‌మెంట్‌ అధికారి ప్రమీలాగాంధీ ఇక్కడి డీఎఫ్‌ఓ సూర్యనారాయణ, సబ్‌డీఎఫ్‌ఓ త్రిమూరులురెడ్డికి తెలియజేశారు. రక్షిత అడవులుగా నోటిఫై చేసే ప్రక్రియ వివరించారు.

పర్యావరణ పరిరక్షణ ఇలా..

రక్షిత అడవులుగా ప్రకటించే ప్రాంతాల్లో సెక్షన్‌ నాలుగు నుంచి సెక్షన్‌ పదిహేను నిబంధనలను అనుసరించి ప్రక్రియలన్నీ పాటించాలి. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల్లో నివసించేవారి నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. గెజిట్‌లో నోటిఫై జరిగిన తదుపరి ఇక పూర్తిగా ఆ ప్రాంతం రక్షిత అడవిగా ఉంటుంది. అడవుల రక్షణ, అడవుల పెంపకం, వన్యప్రాణులు, క్రూర జంతువుల రక్షణ, అరుదైన జాతులకు చెందిన మొక్కల పరిరక్షణ ఇలా అనేక కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తుంటారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.

మరో ఐదు ప్రాంతాలపై...

ఇప్పుడు అభ్యంతరాలు పరిష్కారమైన ప్రాంతాలను గెజిట్‌లో ప్రచురించిన తరవాత నర్సీపట్నం అటవీ డివిజన్‌లోని మరో ఐదు ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. జీకేవీధి ప్రాంతంలో 35,080 హెక్టార్లు, కిన్నెర్ల-2171, కృష్ణాపురం-7037, లంబసింగి -2590, సీలేరు ప్రాంతంలో 3823 హెక్టార్ల విస్తీర్ణంలో అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. విశాఖ డివిజన్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా కార్యక్రమాన్ని అక్కడి అధికారులు చేపడుతున్నారు.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

జిల్లాలో ఒకప్పుడు విస్తారంగా లభించే రోజ్‌వుడ్‌ ఇప్పుడు అంతరించి పోయే స్థితికి చేరుకుంది. ఇటీవలి కాలం వరకు టేకు అక్రమ రవాణా అధికంగా జరిగేది. చిరుతలు, పులుల జాడలేదు. నర్సీపట్నం డివిజన్‌లో జింకలు, కణుజులు, అడవి పందులు, దుప్పులు, కొండగొర్రెలు వేటగాళ్ల బారిన పడుతున్నాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల పోడు వ్యవసాయం జరుగుతూనే ఉంది. అడవి నరికి నేల దున్ని సాగు చేస్తున్నారు. రక్షిత అటవీ ప్రాంతంగా గుర్తింపు వల్ల అధికారులు ఆ ప్రాంతానికి జవాబుదారీగా ఉండాలి. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని