పుట్టినరోజున ఎవరూ రాకండి
close
Updated : 24/07/2021 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుట్టినరోజున ఎవరూ రాకండి

నేతలు, కార్యకర్తలకు కేటీఆర్‌ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా తెరాస ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీ రామారావు కోరారు. పుట్టినరోజు సందర్భంగా శనివారం తాను ఎవరినీ కలవడం లేదని తెలిపారు. శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్‌ రావొద్దన్నారు. నేతలు, అభిమానులంతా బాధితులకు సహాయం చేయాలని, ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ జన్మదిన కానుకగా శనివారం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముక్కోటి వృక్షార్చనను నిర్వహిస్తున్నట్లు ఎంపీ సంతోష్‌కుమార్‌ తెలిపారు. దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం వర్షాలు తగ్గాక నిర్వహిస్తామని ఆయన కార్యాలయం తెలిపింది. కేటీఆర్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ రూపొందించిన డాక్యుమెంటరీని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. కిశోర్‌తో పాటు తెరాస నేతలు సోమాభరత్‌, రవీందర్‌రావు, జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, సినీదర్శకుడు శంకర్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ఆధ్వర్యంలో కేటీఆర్‌పై రూపొందించిన ప్రత్యేకగీతాన్ని ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, దర్శకుడు దూలం సత్యనారాయణ, సంగీత దర్శకుడు కార్తిక్‌ కొడకండ్ల, గీత రచయిత వీరు గడ్డం పాల్గొన్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షమంది విద్యార్థులకు శనివారం నిఘంటువులను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.


ఖిలావరంగల్‌కోట ప్రాంతంలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఆధ్వర్యంలో నేలపై గ్రీనరీతో రూపొందించిన కేటీఆర్‌ చిత్రపటమిది. కేటీఆర్‌పై రూపొందించిన పాటల సీడీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవిష్కరించారు.

- న్యూస్‌టుడే, ఖిలావరంగల్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని