విదేశీ కోడలు.. ఆవకాయ ముచ్చట్లు!
close
Updated : 09/09/2021 13:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశీ కోడలు.. ఆవకాయ ముచ్చట్లు!

అనగనగా ఓ విదేశీ అమ్మాయి, ఓ తెలుగబ్బాయి.. మనసులు కలిశాయి. ఇంట్లో ఒప్పించి.. పెళ్లితో ఒకటయ్యారు. కథ సుఖాంతం. ఎంతోమంది ఈ తరహా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ.. ఈ విదేశీ కోడలు హన్నా శామ్యూల్‌ మాత్రం.. పదహారణాల తెలుగమ్మాయిగా పరిణామం చెందుతూ... ఆ క్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.

న్నా హార్మన్‌ది అమెరికా. వైజాగ్‌ అబ్బాయి అభిషేక్‌ శామ్యూల్‌ను ప్రేమించింది. పెద్దల అంగీకారంతో గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. హన్నా వైజాగ్‌లో అత్తగారింట అడుగుపెట్టాక.. చీర, చుడీదార్‌, ముక్కుపుడక, మెడలో నల్లపూసలు.. ఇలా తెలుగింటి కోడలిగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. తెలుగు వంటల్నీ వండేస్తోంది. భాష మాట్లాడటంతోపాటు రాయడమూ నేర్చేసుకుంటోంది. పైగా వీటన్నింటినీ ఇన్‌స్టా వేదికగా ప్రపంచానికి పంచుతోంది.

తన పరిచయంలో ‘నా పేరు హన్నా. నేనో అమెరికన్ని. ఓ భారతీయుణ్ని పెళ్లి చేసుకున్నా. జీవితం అత్యద్భుతంగా ఉంది. అమెరికా - భారత్‌ సంప్రదాయాల్లో వ్యత్యాసాలను ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నా. భిన్న సంస్కృతుల మధ్య బంధం అంటే ఎన్నో సవాళ్లుంటాయి. వాటిని కూడా చెప్పాలనుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చింది. ఆహారం, దుస్తులు, సీరియళ్లు, సినిమాలు వంటి ఎన్నో విషయాల్లో ఇరు దేశాల మధ్య వ్యత్యాసాన్ని హాస్యం జోడించి చెబుతోంది. ఆవకాయకు, హైదరాబాదీ బిర్యానీకి ఎలా ఫిదా అయ్యిందో పంచుకుంటోంది. అన్నట్టూ ఆమెకు ప్రియా పచ్చడంటే చాలా ఇష్టమట. రెండు రోజుల్లోనే సీసా ఖాళీ చేసేశామంటోంది. తెలుగు బంధాల పేర్లు, సంబంధాలతో సహా విడమరిచి చెబుతోంది. అప్పుడప్పుడూ తన దేశ రుచుల్నీ అత్తింటి వారికి రుచి చూపిస్తోంది. తన వీడియోల్లో భిన్న సంస్కృతుల వాళ్లు ఒకటైనప్పుడు ఎదురయ్యే సవాళ్లను తెలియజేయడమే కాదు.. ఆ బంధంలో మనస్ఫూర్తిగా ఇమడటానికి తాను చేస్తోన్న ప్రయత్నమూ కనిపిస్తుంది. అందుకే మన వాళ్లూ ఆమె అకౌంట్‌ను అనుసరించడమే కాదు.. తన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు కూడా!






మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని