రాతపూర్వకంగానూ ఐపీఎల్‌కు ఓకే - got government approval for IPL in UAE League Chairman Brijesh Patel
close
Published : 11/08/2020 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాతపూర్వకంగానూ ఐపీఎల్‌కు ఓకే

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020ని యూఏఈలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా అనుమతి మంజూరు చేసిందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు. ఇంతకు ముందు మౌఖికంగా చెప్పారని ఇప్పుడు రాతపూర్వకంగా అనుమతించారని పేర్కొన్నారు. అన్నీ సవ్యంగా సాగుతున్నాయని ఫ్రాంచైజీలకు వెల్లడించామన్నారు.

కరోనా వైరస్‌ ముప్పుతో మార్చిలో జరగాల్సిన లీగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆసియాకప్‌, ప్రపంచకప్‌ వాయిదా పడటంతో లీగ్‌ నిర్వహణకు బీసీసీఐకి మరోసారి అవకాశం లభించింది. భారత్‌లో పరిస్థితులు అనువుగా లేకపోవడంతో లీగ్‌ను యూఏఈకి తరలించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ‌19 నుంచి నవంబర్‌ 10 వరకు 10 డబుల్‌ హెడర్స్‌తో టోర్నీ నిర్వహిస్తామని ప్రకటించింది. సాధారణంగా ఒక దేశవాళీ లీగ్‌ను విదేశాల్లో నిర్వహించాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల కిందటే కేంద్రం మౌఖికంగా ఇందుకు పచ్చజెండా ఊపింది. ఇప్పుడు రాతపూర్వకంగా తెలిపింది.

దుబాయ్‌, షార్జా, అబుదాబిలో మ్యాచులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీలు అక్కడ హోటళ్లు, విల్లాలు, అపార్టుమెంట్‌లు బుక్‌ చేశాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు అందరి కన్నా ముందే దుబాయ్‌ చేరుకోనుంది. చెపాక్‌ మైదానంలోకి శిబిరానికి ఆటగాళ్లందరూ చేరుకోగానే ఆగస్టు 22న ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లనున్నారు. అయితే వెళ్లడానికి 24 గంటల ముందు రెండుసార్లు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేస్తారు. అందులో నెగెటివ్‌ వస్తేనే విమానం ఎక్కిస్తారు. లేదంటే ఇక్కడే క్వారంటైన్‌లో ఉండి మళ్లీ రెండు టెస్టుల్లో నెగెటివ్‌ వస్తేనే అనుమతిస్తారు. ఎందుకైనా మంచిదని కొన్ని ఫ్రాంచైజీలు నాలుగు వరకు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నాయని తెలిసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని