Harbhajan Singh: ఫ్రెండ్‌షిప్‌ మూవీ అప్‌డేట్‌ ఇదే! - harbhajan singh wraps up shooting for his debut film friendship
close
Published : 25/07/2021 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Harbhajan Singh: ఫ్రెండ్‌షిప్‌ మూవీ అప్‌డేట్‌ ఇదే!

ఇంటర్నెట్‌డెస్క్‌:  క్రికెట్‌ క్రీడాకారుడిగా మైదానంలో సత్తా చాటిన హర్భజన్‌ సింగ్‌.. కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌’. ఇందులో మెకానిల్‌ ఇంజినీర్‌గా ఆయన కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఆ చిత్ర నిర్మాత కిరణ్‌ రెడ్డి వెల్లడించారు. ‘‘ ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్‌ పూర్తయింది. భజ్జీతో పనిచేయడం చక్కటి అనుభూతి. ఆయనెప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. డబ్బింగ్‌ కార్యక్రమాలనూ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ భాషల్లో ఆయనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవడం ఆసక్తిగా ఉంది. కచ్చితంగా ఆయన నటనను ప్రేక్షకులు స్వీకరిస్తారనే నమ్మకం ఉంది. జులై నెలాఖరుకు ఫ్రెండ్‌షిఫ్‌ ట్రైలర్‌ విడుదల కానుంది. జాన్‌పాల్‌ రాజ్‌, శ్యాం సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాస్లియా కథానాయిక. జేపీఆర్‌, స్టాలిన్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని