బుజ్జి పాండ్య అడుగులు.. పెద్ద పాండ్య నవ్వులు - hardik pandya and natasa stankovic were delighted at the sight of their son agastya on the move
close
Published : 17/05/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుజ్జి పాండ్య అడుగులు.. పెద్ద పాండ్య నవ్వులు


(ట్విటర్‌ చిత్రం)

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. గతేడాది జులైలో అతడి సతీమణి, సెర్బియా నటి  నటాషా స్టాంకోవిచ్‌ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బుజ్జి పాండ్యకు అగస్త్య పాండ్య అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ వాయిదా పడటంతో ఇంట్లోనే ఉంటున్న పాండ్య.. వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్, అనంతరం ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులకు ఎంపిక కాలేదు. దీంతో ఈ ఖాళీ సమయాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తున్నాడు. 

కుమారుడు అగస్త్య పాండ్యతో ఆడుకుంటూ ఆస్వాదిస్తున్నాడు. బుజ్జి పాండ్య బుడి బుడి అడుగులు వేస్తుంటే పాండ్య దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. జూనియర్ పాండ్య బుడి బుడి అడుగులేస్తున్న వీడియోని తాజాగా ముంబయి ఇండియన్స్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.  ఆ వీడియోలో బుజ్జి పాండ్య కిందపడిపోకుండా హార్దిక్‌ పట్టుకోవడంతో చిన్ని చిన్ని అడుగులేసుకుంటూ తల్లి నటాషా ఒడిలోకి వెళ్లాడు జూనియర్‌ పాండ్య. దీంతో  హార్దిక్ దంపతులు ఎంతో మురిసిపోయారు.  ఆ వీడియోని మీరు చూసేయండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని