మాజీ కెప్టెన్‌పై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం - heath streak banned for 8 years for breaching icc anti-corruption code
close
Updated : 15/04/2021 06:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ కెప్టెన్‌పై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: జింబాబ్వే మాజీ కెప్టెన్‌, కోచ్‌ హీత్‌ స్ట్రీక్‌పై అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.  ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను హీత్‌ ఉ‌ల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. హీత్‌ స్ట్రీక్‌ 2016 నుంచి 2018 వరకు జింబాంబ్వేకు, ఇతర దేశవాళీ లీగ్‌లలో జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జరిగిన మ్యాచు‌ల్లోని అంతర్గత సమాచారం బుకీలకు చేరవేయడం, ఆటగాళ్లకు బుకీలను పరిచయం చేశాడనే పలు ఆరోపణలు అతని‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతనిపై జరిగిన విచారణకు ఆటంకం కలిగించేలా వ్యవహరించాడనే ఆరోపణలు సైతం వచ్చాయి. ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు‌ అంగీకరించాడు. చేసిన తప్పునకు పశ్చాత్తాప పడుతున్నట్లు తెలియజేశాడు. హీత్  స్ట్రీక్‌పై విధించిన నిషేధం 28 మార్చి 2029న తొలగిపోనుంది.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని