ఆ హోటల్‌లో  76మందికి కరోనా   - hotel taj in rishikesh shut after 76 people test positive
close
Published : 29/03/2021 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ హోటల్‌లో  76మందికి కరోనా 

రిషికేశ్‌: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గతంలో తగ్గినట్టే కనిపించిన ఈ మహమ్మారి వ్యాప్తి మళ్లీ మొదలై కలవరపెడుతోంది. ఉత్తరాఖండ్‌ రిషికేశ్‌లోని తాజ్‌ హోటల్‌లో కరోనా కలకలం సృష్టించింది. 76మందికి కొవిడ్‌ సోకవడంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.  హోటల్‌ని శానిటైజ్‌ చేసిన అనంతరం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా  హోటల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కుంభమేళాకు హరిద్వార్‌ సన్నద్ధమవుతున్న వేళ కరోనా కేసులు వెలుగుచూడటంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ మేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నందున మరింత అప్రమత్తమైన సర్కార్‌.. కఠిన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేసింది. లేదంటే వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రమైనా ఉండాలని తెలిపింది. కుంభమేళా ఏప్రిల్‌ 1న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని