హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ డ్రైవ్‌ - hypochlorite solution spray in the city
close
Published : 19/04/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ నగరంలో శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టింది. రద్దీ రహదారుల వెంట డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లుతున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది ప్రత్యేకమైన ట్యాంకర్ల ద్వారా ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వైరస్‌ గాల్లో కూడా వ్యాపిస్తున్నట్టు తేలడంతో రద్దీ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమం చేపట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులతో రద్దీగా మారుతున్నాయి.

మరోవైపు సికింద్రాబాద్‌ జోన్‌లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ముషీరాబాద్‌, రాంనగర్‌, భోలక్‌పూర్‌, కవాడిగూడ, సీతాఫల్‌మండి, బేగంపేట, కాచిగూడ డివిజన్లను సందర్శించిన మేయర్‌.. పారిశుద్ధ్య కార్మికుల బయోమెట్రిక్‌ యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా చెత్త రోడ్లపై వేయొద్దని.. ఇళ్ల వద్దకు వచ్చే ఆటోలో మాత్రమే వేయాలని ప్రజలకు సూచించారు.

కాగా, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రెండో దశ కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,009 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే మహమ్మారి కారణంగా 14మంది మృత్యువాతపడ్డారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్‌ కేసులున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని