కొవిడ్‌ చర్యల్లో భారత్‌ స్పందన అద్భుతం - india at forefront in global efforts to forge decisive response to covid-19 prez kovind
close
Published : 12/02/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ చర్యల్లో భారత్‌ స్పందన అద్భుతం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

దిల్లీ: ప్రపంచదేశాలతో పోలిస్తే కరోనా సమయంలో ఆరోగ్యం, ఆర్థికంగా రక్షణ కల్పించే కీలక అంశాల్లో భారత్‌ మెరుగ్గా స్పందించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఈ మేరకు గురువారం జరిగిన ఓ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. భారత్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘టీకా మైత్రి’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వివిధ దేశాలకు ఉచితంగా, అనువైన ధరలకు వ్యాక్సిన్లను అందించిందన్నారు. ‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’ అనే పేరును భారత్‌ నిలుపుకొందన్నారు.

వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్, పనామా, ట్యునీషియా, యునైటెడ్ కింగ్‌డమ్, అర్జెంటీనా రిపబ్లిక్ నుండి రాయబారుల క్రెడెన్షియల్స్‌ను రాష్ట్రపతి అంగీకరించినట్లు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దేశాలతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు రాష్ట్రపతి తెలిపారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌ నియామకం కోసం మద్దతు తెలిపిన ఈ దేశాలకు భారత్‌ కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌తో తమ సంబంధాలను మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తామని ఆయా దేశాల రాయబారులు వెల్లడించారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించేందుకు భారత్‌ చేసిన కృషిని వారు అభినందించారు.

ఇవీ చదవండి..

మిస్‌ ఇండియా.. మన తెలుగు ముద్దుబిడ్డ

కూ పూర్తిగా భారత్‌ యాప్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని