Corona : మూడోసారి 4 లక్షలు దాటిన కేసులు - india corona bulletin
close
Updated : 07/05/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona : మూడోసారి 4 లక్షలు దాటిన కేసులు

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. 4 లక్షలకుపైగా రోజువారీ కేసులు, 4 వేలకు చేరువగా మరణాలు నమోదవడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకుపైగా కేసులు చోటుచేసుకోవడం దేశంలో ఇది మూడోసారి. ఇక మరణాలు వరుసగా పదో రోజు 3 వేలకుపైగా నమోదయ్యాయి. తాజాగా కొవిడ్‌తో పోరాడుతూ 3,915 మంది మరణించారు.

* తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,14,91,598కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 3,915 మంది కొవిడ్‌తో మృతి చెందగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 2,34,083కి పెరిగింది.

* కేసులతో పోల్చితే రికవరీలు కూడా భారీగానే ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. గడిచిన 24 గంటల్లో 3,31,507 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 1,76,12,351గా ఉంది.

* ప్రస్తుతం దేశంలో 36,45,164 క్రియాశీల కేసులు ఉన్నాయి.

* దేశంలో నిన్న  18,26,490 పరీక్షలు నిర్వహించారు.

* ఇప్పటి వరకూ దేశంలో 16,49,73,058 టీకాలు పంపిణీ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని