Cricket News: గబ్బర్‌పై రాహుల్‌దే పైచేయి! - india vs srilanka kl rahaul is ahead of shikhar dhawan
close
Published : 14/07/2021 10:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: గబ్బర్‌పై రాహుల్‌దే పైచేయి!

అందుకే చోటివ్వడం లేదన్న అగార్కర్‌

ముంబయి: ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ శ్రీలంక సిరీసులో రాణించినా టీ20 ప్రపంచకప్‌కు ఎంపికవ్వడం కష్టమేనని మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ అంటున్నాడు. తెలుపు బంతి క్రికెట్లో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ అతడిపై పైచేయి సాధించారని పేర్కొన్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం ఓపెనింగ్‌కు సిద్ధమేనంటున్న సంగతిని గుర్తు చేశాడు. ఏదేమైనా లంక సిరీసులో అదరగొట్టాలని సూచించాడు.

‘పరిస్థితులు ఆసక్తికరంగా ఉన్నాయి. శిఖర్ పరుగులు చేస్తున్నా.. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ అతడిని అధిగమించారనే అనిపిస్తోంది. పరుగులు చేస్తూనే వారిద్దరిపై అతడు ఒత్తిడి పెంచాలి. భారీ స్కోర్లు చేయాలి. ఒక ఆటగాడిగా ఇంతకన్నా చేసేదేం ఉండదు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఎంపికకు లంకలో ప్రదర్శన ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. వారిద్దరిపై ఒత్తిడి పెంచడమే గబ్బర్‌ ముందున్న పని’ అని అగార్కర్‌ అన్నాడు.

‘ఇంగ్లాండ్‌తో తొలి టీ20 ఆడిన తర్వాత ధావన్‌కు చోటు దక్కలేదు. వన్డేల్లో పునరాగమనం చేసి ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో పరుగులు చేశాడు. అతడు ఎలాంటి పొరపాట్లు చేయడం లేదు. దురదృష్టవశాత్తు ఇంగ్లాండ్‌ సిరీస్‌ ఆడలేదు. సమీకరణాల్లో అతడు ఒదిగిపోలేదు. కేఎల్‌ రాహుల్‌ అతడికన్నా ముందున్నాడని నా ఉద్దేశం. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ ఎలాగూ జట్టులో ఉంటాడు. ఇంగ్లాండ్‌ సిరీసులో అంతగా రాణించకపోయినా పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్‌కు తిరుగులేదు. అందుకే శిఖర్‌కు కష్టమవుతోంది’ అని అజిత్‌ తెలిపాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని