ప్రసిద్ధ్‌ను టెస్టుల్లోకి తీసుకోవాలి: సన్నీ - indian selection committee must consider prasidh for tests gavaskar
close
Published : 27/03/2021 18:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రసిద్ధ్‌ను టెస్టుల్లోకి తీసుకోవాలి: సన్నీ

పుణె: టీమ్‌ఇండియా యువ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను సుదీర్ఘ ఫార్మాట్‌కు పరిగణనలోకి తీసుకోవాలని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ సూచించారు. పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తరహాలోనే సెలక్టర్లు అతడితోనూ వ్యవహరించాలని అన్నారు. టెస్టుల్లో కృష్ణ రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీసులో ప్రసిద్ధ్‌ కృష్ణ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచులో 8.1 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. ఇక రెండో వన్డేలోనూ 10 ఓవర్లు విసిరి  2 వికెట్లు తీశాడు. అందరికన్నా తక్కువ ఎకానమీ 5.80తో 58 పరుగులు ఇచ్చాడు. 37వ ఓవర్లో పదునైనా యార్కర్‌తో అతడు జోస్‌ బట్లర్‌ను పెవిలియన్‌ పంపించాడు. అప్పుడే క్రికెట్‌ వ్యాఖ్యానం చేస్తున్న సన్నీ ఇలా అన్నారు.

‘భీకరమైన వేగంతో ప్రసిద్ధ్‌ బంతులు వేస్తున్నాడు. సెలక్టర్లు అతడిని సుదీర్ఘ ఫార్మాట్‌కు పరిగణనలోకి తీసుకోవాలి. జస్ప్రీత్‌ బుమ్రా టీ20లు, వన్డేలు ఆడుతున్నప్పుడే సెలక్టర్లు అతడిని సిద్ధం చేశారు. ఇప్పుడతను టెస్టుల్లో కీలకమైన పేసర్‌గా మారాడు. తన వేగం, బౌన్స్‌తో ప్రసిద్ధ్‌ సైతం మంచి టెస్టు బౌలర్‌‌ అవుతాడు’ అని సన్నీ పేర్కొన్నారు. జోస్‌ బట్లర్‌ను ఔట్‌ చేసిన యార్కర్‌ను ఆడటం ఎవరికైనా  కష్టమేనని వెల్లడించారు.

ప్రసిద్ధ్‌ కర్ణాటక తరఫున 9 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 34, 50 లిస్ట్‌-ఏ మ్యాచుల్లో 87 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కీలక ఆటగాడిగా ఉన్నాడు. ప్రతి సీజన్లో నిలకడగా రాణిస్తున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని