అంతర్జాతీయ విమానాల రద్దు గడువు పొడిగింపు - international passenger flights to stay banned till february 28
close
Updated : 28/01/2021 21:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతర్జాతీయ విమానాల రద్దు గడువు పొడిగింపు

దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికుల వాణిజ్య విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) మరోసారి పొడిగించింది. కరోనాతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కార్గో విమానాలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమాన సర్వీసులకు మాత్రం ఈ షరతులు వర్తించవని స్పష్టంచేసింది. ఈ మేరకు డీజీసీఏ సంయుక్త డీజీ సునీల్‌ కుమార్‌ గురువారం సాయంత్రం సర్క్యులర్‌ జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తోంది.

ఇదీ చదవండి..

ఆ 2 రాష్ట్రాల్లోనే 67% యాక్టివ్‌ కేసులు మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని