సందేహం లేదు.. ఇదొక మినీ ఐపీఎల్‌! - its a mini ipl no doubt
close
Published : 10/01/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సందేహం లేదు.. ఇదొక మినీ ఐపీఎల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-2021 ముంగిట జరుగుతున్న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ మినీ ఐపీఎల్‌ను తలపిస్తోంది. ఐపీఎల్‌లోని ఎనిమిది ఫ్రాంచైజీలకు ఆడుతున్న క్రికెటర్లలో చాలామంది ఈ టోర్నీలో భాగస్వాములు అవుతున్నారు. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, రియాన్‌ పరాగ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, కృనాల్‌ పాండ్య, అర్షదీప్‌ సింగ్‌ వంటి యువ కెరటాలు తమ సొంత జట్ల తరఫున పోటీ పడబోతున్నారు. సీనియర్‌ క్రికెటర్లైన శిఖర్‌ ధావన్‌, సురేశ్‌ రైనా, ఇషాంత్‌ శర్మ, రాబిన్‌ ఉతప్ప, దినేశ్‌ కార్తీక్‌, అంబటి రాయుడు ప్రత్యర్థులతో తలపడబోతున్నారు.

జనవరి 10 నుంచి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఆరభమవుతున్న సందర్భంగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలన్నీ స్పందించాయి. తమ తరఫున ఆడుతున్నవారికి అభినందనలు తెలియజేశాయి. దేశవాళీ పొట్టి క్రికెట్‌ టోర్నీలో మెరుపులు మెరిపించాలని సోషల్‌ మీడియాలో ఆకాంక్షించాయి. అంతేకాకుండా కరోనా సంక్షోభం తర్వాత బయో బుడగ విధానంలో దేశవాళీ క్రికెట్‌ మొదలవుతున్నందుకు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు సంతోషిస్తున్నాయి. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటించడంతో ఎంఎస్‌ ధోనీ ఈ టోర్నీలో ఆడటం లేదు. అతడు ఎలాంటి సాధన లేకుండానే తిరిగి ఐపీఎల్‌ ఆడనున్నాడు. మొత్తం 38 జట్లు దేశవాళీ పోరులో పోటీపడుతున్నాయి.

ఇవీ చదవండి
నయావాల్‌.. డీకోడెడ్‌!
మహ్మద్‌ సిరాజ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు!

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని