కరోనా ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో మోదీ సమీక్ష - modi meets chief ministers of covid hit states
close
Updated : 23/04/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో మోదీ సమీక్ష

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్ష నిర్వహించారు. దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, పినరయి విజయన్‌, అశోక్‌ గెహ్లోత్‌, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఆక్సిజన్‌ కొరతపై మోదీ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. 

మే 1వ తేదీ నుంచి 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత లేకుండా చూడాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ ఈ సందర్భంగా ప్రధాని మోదీని కోరారు. దిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం కేజ్రీవాల్‌ ప్రధానిని అభ్యర్థించారు. 

ఆక్సిజన్‌ తయారీదారులతోనూ..

సీఎంలతో వర్చువల్‌ భేటీ అనంతరం ఆక్సిజన్‌ తయారీదారులతోనూ మోదీ సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రాణవాయువు తయారీదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై ఆక్సిజన్‌ నిల్వల గురించి చర్చించారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిని వేగంగా పెంచాలని సూచించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని