నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌ - nagababu interesting comments on niharika and varun
close
Updated : 24/01/2021 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌

నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తన ముద్దుల కుమార్తె నిహారికకు ఘనంగా పెళ్లి చేసిన ఆనందంలో ఉన్నారు మెగా బ్రదర్‌ నాగబాబు. ఐదు రోజులపాటు జరిగిన నిహారిక-చైతన్యల పెళ్లి వీడియోలను సైతం నాగబాబు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వృత్తిపరమైన పనుల్లో బిజీగా ఉంటున్న నాగబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నిహారిక పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఈ సృష్టికి మహిళలే మూలం. అందుకే ఆడవాళ్లపై నాకు ఎక్కువ గౌరవం. వరుణ్‌బాబు పుట్టిన తర్వాత ఒక కూతురు పుడితే బాగుండని అనుకున్నాను. అలాగే మాకు నిహారిక జన్మించింది. నిహారిక అంటే నాకెంతో ఇష్టం. తను నాకో బెస్ట్‌ ఫ్రెండ్. నాకు సంబంధించిన ఎన్నో విషయాలను ఆమెతోనే పంచుకుంటాను. మాఇద్దరి మధ్య మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉంది. కాకపోతే, పెళ్లి అయ్యాక మా ఇద్దరి మధ్య మాటలు కొంచెం తగ్గాయి. అయినప్పటికీ తను జీవితంలో కొత్త అంకానికి నాంది పలికినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.’

‘నిహారిక ఎక్కడైనా సరే ఎక్కువగా అల్లరి చేస్తుంటుంది. కానీ, వరుణ్‌బాబు అలా కాదు ఇంట్లో, కొంతమంది బెస్ట్‌ ఫ్రెండ్స్‌ దగ్గర మాత్రమే ఓపెన్‌గా ఉంటాడు. పబ్లిక్‌లోకి వెళితే చాలా సైలెంట్‌. ఇక వరుణ్‌ పెళ్లి విషయానికి వస్తే.. ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది కాదు.. మేము ముఖ్యంగా కోరుకునేది మాత్రం పిల్లలకు మంచి జీవిత భాగస్వాములు రావాలని. కాబట్టి వరుణ్‌బాబుకు ఏ విధంగానైనా (ప్రేమ, పెద్దలు కుదిర్చిన పెళ్లి) సరే అర్థం చేసుకునే మంచి అర్ధాంగి రావాలని కోరుకుంటున్నాను’ అని నాగబాబు వివరించారు.

ఇదీ చదవండి

పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్‌ అయ్యింది!

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని