విభిన్న ప్రేమకథలో? - naveen and anushka team up for a different love story
close
Published : 20/03/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విభిన్న ప్రేమకథలో?

‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటించబోయే చిత్రంపై స్పష్టత వస్తోంది. ఆమె త్వరలో మహేష్‌ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చేయబోతుంది. ఇందులో అనుష్క సరసన నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం. ఓ విభిన్నమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తుంది. పాతికేళ్ల కుర్రాడితో.. నలభై ఏళ్ల మహిళ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అన్నది ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించనున్నారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుందని తెలిసింది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌ సంస్థ నిర్మించబోతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని