క్రేజీ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌లు ఫిక్స్‌ - new movies in tollywood
close
Published : 11/02/2021 10:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రేజీ కాంబోలో భారీ ప్రాజెక్ట్‌లు ఫిక్స్‌

నందమూరి హీరోల చిత్రాలపై అధికారిక ప్రకటన

హైదరాబాద్‌: తెలుగు చలన చిత్రపరిశ్రమలో మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కనున్నాయి. నందమూరి కుటుంబానికి చెందిన ఇద్దరు కథానాయకుల తదుపరి సినిమాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రిమూవీ మేకర్స్‌ అధికారికంగా వెల్లడించింది. ‘ఉప్పెన’ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తమ తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి తెలియజేశారు.

బాలయ్య-గోపీచంద్‌ ఫిక్స్‌

మాస్‌ అభిమానుల నాడి తెలుసుకోవడంలో నందమూరి బాలకృష్ణ దిట్ట. మరోవైపు ఇటీవల విడుదలైన ‘క్రాక్‌’తో మాస్‌ అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు గోపీచంద్‌ మలినేని. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై మైత్రిమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌ స్పందించారు. బాలయ్య-గోపీచంద్‌ మలినేని కాంబోలో తమ బ్యానర్‌పై సినిమా చేస్తున్న విషయం నిజమేనని చెప్పారు. ప్రస్తుతం గోపీచంద్‌ స్ర్కిప్ట్‌ పనిలో ఉన్నారని.. బాలయ్య-బోయపాటి సినిమా పూర్తవగానే తమ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని వారు వెల్లడించారు.

‘సలార్‌’ తర్వాత తారక్‌తోనే..

‘కేజీఎఫ్‌’తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. తారక్‌తో ఆయన ఓ సినిమా చేయనున్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ‘సలార్‌’ తర్వాత ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబోలో తమ బ్యానర్‌పై ఓ సినిమా సిద్ధం కానుందని నవీన్‌ తెలిపారు. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ చిత్రానికి ఓకే చేసిన విషయం తెలిసిందే. ఇలా తమ అభిమాన హీరోలకు సంబంధించిన తదుపరి చిత్రాల గురించి అధికారికంగా ప్రకటన వెలువడడంతో నందమూరి అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి

‘లైగర్‌’ వచ్చేస్తున్నాడు..!

పుష్ప షూట్‌.. నాలుగు గంటలే నిద్ర: రష్మిక
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని