విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్‌! - pak pm imran khan won in trust vote in pak parliament
close
Published : 06/03/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్‌!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన సెనేట్‌ ఎన్నికల తర్వాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పాక్‌ పార్లమెంట్‌ విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా శనివారం దిగువ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించగా.. ఇమ్రాన్‌ ఖాన్‌ 178 ఓట్లతో విజయం సాధించారు. దిగువ సభలో మొత్తం 342 సభ్యులకు గాను.. నెగ్గడానికి 172 ఓట్లు అవసరం. అయితే, ఇమ్రాన్‌కు అనుకూలంగా 178 మంది ఓటు వేశారు. దీంతో విశ్వాస పరీక్ష నుంచి ఇమ్రాన్‌ గట్టెక్కినట్లైంది. కాగా, పాకిస్థాన్‌ డెమోక్రటిక్‌ మూమెంట్‌ (పీడీఎం) కూటమిలోని 11 ప్రతిపక్ష పార్టీలు ఈ బల నిరూపణ పరీక్ష ఓటింగ్‌ను బాయ్‌కాట్‌ చేయడం గమనార్హం. 

ఇటీవల పాక్‌లో సెనేట్‌కు జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ కేబినెట్‌లోని ఆర్థిక మంత్రి ఓటమి పాలైన విషయం తెలిసిందే. సెనేట్‌ ఎన్నికలో విపక్షాల అభ్యర్థి యూసుఫ్‌ రాజా గిలానీకి 169 ఓట్లు రాగా.. ఇమ్రాన్‌ పార్టీ (పీటీఐ)కి చెందిన అభ్యర్థికి 164 ఓట్లు వచ్చి ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయి.. ప్రతిపక్షాలు ఇమ్రాన్‌ను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చాయి. ఈ క్రమంలో విశ్వాస పరీక్షకు వెళ్లిన ఇమ్రాన్‌.. స్వల్ప ఓట్లతో గట్టెక్కారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని