మోదీకి జగన్‌ లేఖ ఇస్తే సరిపోతుందా?: పవన్‌ - pawan kalyan pressmeet in delhi
close
Published : 10/02/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోదీకి జగన్‌ లేఖ ఇస్తే సరిపోతుందా?: పవన్‌

దిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ కోరింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర పెద్దలను కలిసి వివరించినట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. దిల్లీలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరామని పవన్‌ చెప్పారు.

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీలు ఎంతో చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో మళ్లీ సమావేశమయ్యే అవకాశముందని.. ఆ భేటీలో జనసేన-భాజపా రోడ్‌మ్యాప్‌పై చర్చిద్దామని అమిత్‌షా చెప్పినట్లు పవన్‌ తెలిపారు. షర్మిల కొత్త పార్టీపై మీడియా ప్రతినిధులు పవన్‌ను ప్రశ్నించగా ఆ పార్టీ పెట్టాక విధివిధానాలను బట్టి మాట్లాడతానని చెప్పారు. అనంతరం నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

చంద్రబాబు ఓటమిని హుందాగా ఒప్పుకోవాలి: సజ్జల

వట్టిచెరుకూరులో వైకాపా వర్గాల మధ్య ఘర్షణమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని