పవన్‌కు జన్మదిన కానుక.. ఇప్పుడే ఎందుకు.? - portrait designed picture gifted to powerstar Pawan Kalyan
close
Published : 25/12/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కు జన్మదిన కానుక.. ఇప్పుడే ఎందుకు.?

హైదరాబాద్‌: ఇద్దరు పవర్‌స్టార్‌ అభిమానులు పవన్‌కల్యాణ్‌కు పుట్టిన రోజు కానుక అందజేశారు. అదేంటి పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2న కదా..! ఇప్పుడు కానుక ఇవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా..? అవును.. ఇప్పుడే ఇచ్చారు. దానికి ఓ కారణం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనిల్‌, భాను.. పవన్‌కు వీరాభిమానులు. అందుకే తమ అభిమాన హీరో పవర్‌స్టార్‌ చిత్రం గీసి ఆయన పుట్టిన రోజున కానుకగా ఇద్దామని అనుకున్నారు. కరోనా వల్ల ఆయనను కలవడం కుదరలేదు. తాజాగా ఆయనను కలిసే అవకాశం వచ్చింది. దీంతో అప్పుడు ఇద్దామనుకున్న చిత్రపటాన్ని ఇప్పుడు ఆయనకు అందజేశారు. పవన్‌కల్యాణ్‌ రాజకీయ పార్టీ జనసేనను ఉద్దేశిస్తూ.. ‘పదం శబ్దం చేస్తే.. నిశ్శబ్దం మాట్లాడుతుంది’ అని రాసి.. చివర్లో ‘హ్యాపీ బర్త్‌డే’ అని రాసుకొచ్చారు. వాళ్లిద్దరూ కిక్‌, గోపాల గోపాల, అజ్ఞాతవాసి, ఎంసీఏ సినిమాలకు పబ్లిసిటీ కంటెంట్ డిజైనర్లుగా పనిచేశారు. ఈ చిత్రపటం పవన్‌ కల్యాణ్‌కు అందించేందుకు మూడు నెలలు ఎదురుచూడాల్సి వచ్చిందని వాళ్లు చెప్పారు.

ఇదిలా ఉండగా.. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘వకీల్‌ సాబ్‌’లో నటిస్తున్నారు. శృతిహాసన్‌ కథానాయిక. ప్రకాశ్‌రాజ్‌, నివేదా థామస్, అంజలి, అనన్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలకపాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘పింక్‌’కు తెలుగు రీమేక్‌గా ‘వకీల్‌సాబ్‌’ తెరకెక్కుతోంది. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు, బోనీకపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు..

ఇదీ చదవండి..

లండన్‌లో లాక్‌డౌన్‌.. చిక్కుకుపోయిన ప్రియాంకమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని