పుష్పరాజ్‌.. ఏడో తారీఖు వచ్చేస్తున్నాడు - pushpa raj mass update
close
Updated : 03/04/2021 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుష్పరాజ్‌.. ఏడో తారీఖు వచ్చేస్తున్నాడు

హైదరాబాద్‌: స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఊరమాస్‌ గెటప్‌లో దర్శనమివ్వనున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్‌‌, రిలీజ్‌ డేట్‌ పోస్టర్లను మినహాయించి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ను చిత్రబృందం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. అయితే, మరికొన్ని రోజుల్లో బన్నీ పుట్టినరోజు(ఏప్రిల్‌8) సందర్భంగా ఓ మాస్‌ అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా అభిమానులతో పంచుకుంది.ఈ మేరకు ఏప్రిల్‌ 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌ను విజువల్‌గా పరిచయం చేయనున్నట్లు తెలిపింది.

బన్నీ-సుకుమార్‌ కాంబోలో ఇప్పటికే ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆగస్టు 13న ‘పుష్ప’ విడుదల కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని