‘రాధేశ్యామ్‌’కు ఒక్కరు కాదు.. ముగ్గురు - radhe shyam music directors
close
Published : 11/02/2021 22:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’కు ఒక్కరు కాదు.. ముగ్గురు

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ కథానాయకుడుగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రాల్లో ‘రాధేశ్యామ్‌’ ఒకటి. పూజా హెగ్డే నాయిక. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జస్టిన్‌ ప్రభాకరన్‌ ఎంపికయ్యారని గతంలోనే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా మరో ఇద్దరు సంగీత దర్శకులు ఈ సినిమాకు పనిచేస్తున్నారని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రభాకరన్‌, హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారని అభిమానులతో పంచుకుంది. హిందీ వెర్షన్‌కి సంబంధించి మిథున్‌ రెండు పాటలు, మనన్‌ భరద్వాజ్‌ ఒక పాటకి సంగీతం అందింస్తున్నారు.

గొప్ప ప్రేమకథని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలంటే సంగీతం  ప్రధాన కారణంగా నిలుస్తుంది. 70ల కాలం నాటి స్వచ్ఛమైన ఈ కథని మ్యూజిక్‌తోనే ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లగలమని భావించి చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుంది. భాషలు వేరైనా ఈ ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్లు తమ సంగీతంతో ఒకే భావం వ్యక్తపరగలరని పేర్కొంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి ప్రేమ కథలో ప్రభాస్‌ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర టీజర్‌ విడుదల కానుంది.

ఇదీ చదవండి..

సందడి చేస్తోన్న ‘ధక్‌ ధక్‌ ధక్‌’ టీజర్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని