RRR: షూటింగ్‌కు రామరాజు రెడీ - ramcharan begins rrr shoot
close
Updated : 21/06/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RRR: షూటింగ్‌కు రామరాజు రెడీ

హైదరాబాద్‌: చిత్రపరిశ్రమలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత కొన్నిరోజుల నుంచి వాయిదా పడిన షూట్స్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌ త్వరలో ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిష్ట్‌ అలీమ్‌ హకీమ్‌ చెర్రీతో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. ‘లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో షూటింగ్స్‌ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌లో చరణ్‌ హెయిర్‌స్టైల్‌తో నా రోజు ప్రారంభమైంది. మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌కి చెర్రీ సిద్ధమయ్యారు’ అని అలీమ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ సందడి చేయనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న విషయం విదితమే.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని