​​​​​​₹7వేలకే రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్లివీ - realme c11 launched in india
close
Published : 26/06/2021 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

​​​​​​₹7వేలకే రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్లివీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ బడ్జెట్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునేవారి కోసం రియల్‌మీ సంస్థ మరో మొబైల్‌ను లాంచ్‌ చేసింది. గతేడాది తీసుకొచ్చిన రియల్‌మీ సీ11 కొనసాగింపుగా.. సీ11 (2021)ను విడుదల చేసింది. గతంలో ఈ ఫోన్‌లో డ్యూయల్‌ కెమెరా ఉండగా.. ఈ సారి సింగిల్‌ కెమెరాతో తీసుకొచ్చారు. మరి ఈ ఫోన్‌ ఎలా ఉంది? ధరెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

రియల్‌మీ సీ11 2జీబీ/32జీబీ వేరియంట్‌లో వస్తోంది. రెండు రంగుల్లో లభిస్తోంది. దీని ధరను ₹6,999గా కంపెనీ నిర్ణయించింది. రియల్‌మీ.కామ్‌ వెబ్‌సైట్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు. గతేడాది విడుదల చేసిన మోడల్‌ ధరను ₹7,499గా కంపెనీ పేర్కొంది.

ఇక ప్రత్యేకతల విషయానికొస్తే ఆండ్రాయిడ్‌ 11తో రియల్‌మీ యూఐ 2.0తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తు్న్న ఈ ఫోన్‌లో ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుకవైపు 8 ఎంపీ కెమెరా, ముందు వైపు 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఇంటర్నల్‌ స్టోరేజీని 256 జీబీ వరకు పెంచే వీలుంది. 5000ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌.. ఓటీజీ కేబుల్‌ ద్వారా రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయానికి కూడా సపోర్ట్‌ చేస్తుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని