ఒక్కరోజే సుమారు 14 లక్షల మందికి టీకా - record 14 lakh people vaccinated in last 24 hrs
close
Published : 05/03/2021 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కరోజే సుమారు 14 లక్షల మందికి టీకా

దేశంలో 1.8 కోట్లు దాటిందని వెల్లడి..

దిల్లీ: దేశంలో ఒకవైపు వ్యాక్సిన్ పంపిణీ సాఫీగా సాగుతుండగా.. మరోవైపు రోజు రోజుకీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే రెండో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో దేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షలు(13,88,170) మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 16న మొదటి దశ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించినప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత మందికి టీకా అందించడం తొలిసారి అని ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటివరకు దేశంలో 1.8 (1,80,05,503) కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం గణాంకాలు వెల్లడించింది. ఇందులో 68,53,083 మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లకు, 60,90,931 ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఫస్ట్‌ డోస్‌ ఇవ్వగా, రెండో దశలో 31,41,371 మంది ఆరోగ్య కార్యకర్తలకు, 67,297 మంది ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలకు రెండో డోస్‌ అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

45 ఏళ్లు దాటి తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారిలో 2,35,901 మందికి, 60 సంవత్సరాలు దాటిన 16,16,920 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు నాటికి 300 మిలియన్ల మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని