రెండింటి ప్రయోజనాలు తెలుసు - shruti haasan about movie theaters and ott
close
Published : 27/02/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండింటి ప్రయోజనాలు తెలుసు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొంత విరామం తర్వాత ‘క్రాక్‌’తో తెలుగులో అడుగుపెట్టి భారీ హిట్‌ కొట్టింది శ్రుతిహాసన్‌. కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల తర్వాత థియేటర్లు తెరుచుకున్నాకా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించి భారీ వసూళ్లు అందుకుంది. మరోవైపు థియేటర్లు మూసేసిన సమయంలో ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు ఓటీటీ వేదికలే దారి చూపాయి. మరి ఓటీటీ.. థియేటర్‌ ఈ రెండింటిలో ఏది గొప్పది?

అంటే శ్రుతి ఏమందంటే..‘‘థియేటర్లో సినిమా చూసిన అనుభూతికి ఏదీ సాటిరాదు. కొన్ని సినిమాలను పూర్తిగా థియేటర్లోనే చూడగలం. అదే సమయంలో ఓటీటీ వేదికలన్నా నాకు చాలా అభిమానం. వాటిలో ఎన్నో గొప్ప కథా చిత్రాలు ప్రేక్షకులకు దొరుకుతున్నాయి. నేనూ ఎన్నో వైవిధ్యమైన సినిమాల్ని, వెబ్‌ సిరీస్‌లను అందులోనే చూశాను. థియేటర్ల వరకు రాలేని ఎన్నో గొప్ప కథల్ని వాటిల్లో చూడగలుగుతున్నాం. నాకు థియేటర్‌..ఓటీటీ ఈ రెండింటితోనూ ఉన్న ప్రయోజనాలేంటో బాగా తెలుసు’’అని చెప్పింది శ్రుతి. ఆమె ప్రభాస్‌ సరసన ‘సలార్‌’లో నటిస్తోంది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని