వేడుకగా సిరివెన్నెల తనయుడి వివాహం - sirivennela seetharama sastry son raja wedding
close
Updated : 01/11/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేడుకగా సిరివెన్నెల తనయుడి వివాహం

హైదరాబాద్‌: సుప్రసిద్ధ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా ఓ ఇంటివాడయ్యారు. వధువు వెంకటలక్ష్మి హిమబిందుతో ఆయన వివాహం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. వేద మంత్రాల మధ్య రాజా వధువు మెడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌లో జరిగిన వేడుకకు అతి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. నటుడు రాజా ఓ ఇంటివాడు కావడంతో చిత్ర పరిశ్రమలో నటీనటులు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని