15 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమంత్ ‘గోదావరి’ చిత్రం  - sumanth godavari movie is completed 15 years
close
Published : 19/05/2021 22:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

15 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమంత్ ‘గోదావరి’ చిత్రం 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుమంత్‌ కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గోదావరి’.  అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా కమలినీ ముఖర్జీ నటించింది. నీతూ చంద్ర మరో నాయికగా అలరించింది. సరిగ్గా నేటికి ఈ సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. మే 19, 2006లో విడుదలైన ఈ సినిమాని అమిగోస్‌ క్రియేషన్స్, కాడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి చిత్రాన్ని నిర్మించగా జీవీజీ రాజు నిర్మాత .  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మూడో చిత్రం ఇది.  సినిమాలోని ‘‘ఉప్పొంగెలే గోదావరి..’’, ‘‘రామచక్కని సీతకి..’’, ‘‘అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా’’లాంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.  చిత్రానికి కేఎమ్‌ రాధాకృష్ణన్‌ సంగీతం ఎంతగానో ఉపకరించింది. సినిమా వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు పొంది నంది, ఫిల్మ్ ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో కమల్‌ కామరాజు, తనికెళ్ల భరణి, కరాటే కల్యాణి, చిన్నా తదితరులు నటించారు.  ఈ సినిమా కథేంటంటే రామ్ (సుమంత్‌) అమెరికాలో చదువుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటూ ఉంటాడు. తను చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. ఇతనికి రాజీ అనే మరదలు ఉంటుంది. ఆమెంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. ఇక మరో పాత్ర సీతా మహాలక్ష్మి (కమలినీ) ఆత్మాభిమానం మెండుగా ఉన్న అమ్మాయి. సొంతంగా తన కాళ్లమీద నిలబడి వ్యాపారం చేస్తుంటుంది. ఆమెకి తల్లిదండ్రులు పెళ్లి  సంబంధాలు చూస్తుంటారు. ఏదో ఒక కారణంతో వాటిని తిరస్కరిస్తూ ఉంటుంది. అనుకోకుండా వీరంతా గోదావరి ఓ విహారయాత్ర పడవలో కలుసుకుంటారు. ఈ ప్రయాణంలో ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నదితో పాటు పాపికొండల ప్రాంతంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని