చిరు తనయ ఆ క్రైమ్‌ థ్రిల్లర్‌ తీసుకొన్నారా? - sushmita konidela to remake 8 thottakkal in telugu
close
Published : 26/04/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు తనయ ఆ క్రైమ్‌ థ్రిల్లర్‌ తీసుకొన్నారా?

ఇంటర్నెట్‌ డెస్క్: అగ్ర కథానాయకుడు చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌తో ఆమె నిర్మాతగా మారారు. ఇప్పుడు మరో ఆసక్తికర చిత్రానికి సంబంధించిన హక్కులను ఆమె కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళంలో 2017లో వచ్చిన ‘8 తొట్టక్కల్‌’ థ్రిల్లర్‌ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కలను సుస్మిత దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుస్మిత తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ వేదికగా పలు చిత్రాలు తీయనున్నట్లు సుస్మిత గతంలోనే ప్రకటించారు.

ఇక శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ‘8 తొట్టక్కల్‌’ చిత్రం కథేంటంటే నిజాయితీ గల ఒక పోలీసు.. ఒక నేరస్థుడిని పట్టుకొనే క్రమంలో అనుకోకుండా తన సర్వీస్ రివాల్వర్‌ కోల్పోతాడు. అయితే ఆ రివాల్వర్‌ దొంగిలించిన దొంగ దానిని వేరే వాళ్లకు అమ్ముతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఇలాంటి సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌, వినోదాత్మక కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఆసక్తితోనే రీమేక్‌ హక్కులను కొనుగోలు చేశారట సుస్మిత. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని