ఆసక్తికరంగా ‘తాండవ్‌’ ట్రైలర్‌ - tandav official trailer saif ali khan dimple kapadia
close
Published : 04/01/2021 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసక్తికరంగా ‘తాండవ్‌’ ట్రైలర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్రనటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘తాండవ్‌’ ట్రైలర్‌ విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ తన అధికారిక ఖాతా ద్వారా యూట్యూబ్‌లో ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది. రాజకీయాల నేపథ్యంలో పొలిటికల్‌ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం అలి అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌అయూబ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 15 నుంచి అమెజాన్‌లో ప్రసారం కానుంది. రాజకీయాలే ప్రధానాంశంగా వస్తున్న ఈ సిరీస్‌ 9 భాగాలుగా ఉంటుంది.

కాగా.. 2.59 నిడివిగల ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇందులో సైఫ్ అలీఖాన్.. తన తండ్రి మరణం తర్వాత ప్రధాని కావాలని కోరుకునే రాజకీయ నాయకుడిగా సమర్ ప్రతాప్సింగ్‌ పాత్రలో కనిపిస్తారు. ‘‘వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పుడు పనులు చేశారు. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు’’ అంటూ సైఫ్‌ అలీఖాన్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సునీల్ గ్రోవర్, టిగ్‌మన్‌షు, ధులియా కుముద్ మిశ్రా, మహ్మద్ జీషన్ అయూబ్, కృతిక కమ్రా, సారా-జేన్ డయాన్, గౌహర్ కృతికా అవస్తి, డినో మోరియా, అనుప్ సోని, పరేష్ పహుజా తదితరులు నటించారు.

ఇదీ చదవండి

చిరు-నయన్ అలా కనిపించబోతున్నారా?

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని