Ap News: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు డీఏ పెంపు - telugu-news-ap government increased da for employees and
close
Published : 01/08/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap News: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు డీఏ పెంపు

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం మేర కరవు భత్యాన్ని (డీఏ) పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెరుగుదలతో ఉద్యోగి మూల వేతనంపై 30.392 శాతం నుంచి 33.536 శాతానికి డీఏ పెరిగినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 జనవరి 1 తేదీ నుంచి డీఏ పెంపుదల ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికీ డీఏ పెంపుదల వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2021 జూలై నెల వేతనంతో పెంచిన కరవు భత్యాన్ని చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 2019 జనవరి 1వ తేదీ నుంచి డీఏ బకాయిలును సమాన వాయిదాల్లో జూలై 2021 నుంచి చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది.

పింఛన్‌దారులకు..

ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు 3.144 శాతం కరవు భత్యాన్ని (డీఏ) పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏను 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పెంపుతో పింఛన్‌దారుల డీఏ 33.536 శాతానికి పెరిగినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి  రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

30శాతం హెచ్‌ఆర్‌ఏ మరో ఏడాది పొడిగింపు

హైదరాబాద్‌ నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి తరలివచ్చిన సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏను మరో ఏడాది పొడిగిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జులై 1 నుంచి ఏడాది పాటు హెచ్‌ఆర్‌ఏ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చి విజయవాడ, గుంటూరులో అద్దె ప్రాతిపదికన నివాసం ఉంటున్న ఉద్యోగులకు 30శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హైదరాబాద్‌ నుంచి తరలిరాని ఉద్యోగులకు, నూతనంగా ఉద్యోగాల్లోకి చేరిన వారికి, డిప్యూటేషన్‌పై వచ్చిన వారికి ఇంటి అద్దె భత్యం ఉత్తర్వులు వర్తించవని వెల్లడించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని