TS NEWS:  తెలంగాణలో ‘సీపీజీఈటీ-2021’ నోటిఫికేషన్‌ విడుదల - telugu news cpget 2021 notification released
close
Updated : 28/07/2021 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS NEWS:  తెలంగాణలో ‘సీపీజీఈటీ-2021’ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలోని వర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘సీపీజీఈటీ-2021’ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనమేరకు సీపీజీఈటీ సెట్‌ను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈనెల 30 నుంచి ఆగస్టు 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు సీపీజీఈటీ సెట్‌ కన్వీనర్‌ పాండు రంగారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం  కల్పించారు. రూ.2వేల ఆలస్య రుసుముతో సెప్టెంబరు 3వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. సెప్టెంబరు 8 నుంచి సీపీజీఈటీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని