AP News: కొప్పర్రులో రాళ్ల దాడి ఘటన.. పోలీసుల అదుపులో 15 మంది - telugu news guntur district kopparru incident police arrested 15 members
close
Updated : 21/09/2021 11:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: కొప్పర్రులో రాళ్ల దాడి ఘటన.. పోలీసుల అదుపులో 15 మంది

పెదనందిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో జరిగిన ఘర్షలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పొన్నూరు గ్రామీణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. నిన్న రాత్రి వినాయకుడి విగ్రహం నిమజ్జనంలో భాగంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా ఓ పార్టీకి చెందిన వారు జెండాలు ఊపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలిపారు. గొడవలో మూడు ద్విచక్రవాహనాలు దహనమైనట్లు చెప్పారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయని.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని