Attack: 5 రూపాయలు తక్కువైందని.. వ్యక్తిపై హోటల్‌ యజమాని దాడి  - telugu news hotel owner attacked the man
close
Updated : 13/09/2021 07:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Attack: 5 రూపాయలు తక్కువైందని.. వ్యక్తిపై హోటల్‌ యజమాని దాడి 

కటక్, న్యూస్‌టుడే: హోటల్‌లో భోజనం చేసిన వ్యక్తి రూ.5లు తక్కువ ఇవ్వడంతో సదరు హోటల్‌ యజమాని వినియోగదారుడిపై తీవ్రంగా దాడి చేసిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. కొడుకుతో కలిసి యజమాని వినియోగదారుడిని కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు యజమాని, అతడి కుమారుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. శనివారం కేంఝర్‌ జిల్లా ఘాసిపూర్‌ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీ బజార్‌ ప్రాంతంలోని మధుసూదన్‌ సాహు హోటల్‌లో జితేంద్ర దేహురి భోజనం చేశాడు. హోటల్‌ యజమాని మధుసూదన్‌ సాహు రూ.45 బిల్లు అయిందని జితేంద్రకు తెలిపాడు. దాంతో జితేంద్ర తన వద్ద రూ. 40 మాత్రమే ఉన్నాయని, మిగిలిన ఐదు రూపాయలు సాయంత్రం ఇస్తానని అన్నాడు. దాంతో హోటల్‌ యజమాని జితేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేసి కొడుకుతో కలిసి తీవ్రంగా దాడి చేశారు. అనంతరం జితేంద్ర స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హోటల్‌ యజమాని, కుమారుడిని అరెస్టు చేసి, న్యాయస్థానానికి తరలించారు.  



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని