Meet Cute: 12 మంది నటులతో... - telugu news meet cute latest update
close
Published : 06/08/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Meet Cute: 12 మంది నటులతో...

హైదరాబాద్‌: కథానాయకుడు నాని సమర్పణలో... వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై ‘మీట్‌ క్యూట్‌’ తెరకెక్కుతోంది. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. నాని సోదరి దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సంస్థ నుంచి ఇదివరకు వచ్చిన ‘అ’, ‘హిట్‌’ చిత్రాలతో ప్రశాంత్‌ వర్మ, శైలేష్‌ కొలను దర్శకులుగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఐదు కథల సంకలనంగా రూపొందుతున్న ఈ చిత్రంలో 12 మంది నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సత్యరాజ్‌తోపాటు... రోహిణి, అదాశర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహానీ శర్మ, సునైన, సంచిత పూనాంచ, అశ్విన్‌కుమార్, శివ కందుకూరి, దీక్షిత్‌శెట్టి, గోవింద్‌ పద్మసూర్య, రాజా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వసంత్‌కుమార్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, విజయ్‌ బుల్గానిన్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని